రేపల్లె నియోజకవర్గం

రేపల్లె , డెల్టాప్రాంతంలో గుంటూరు జిల్లాలో ఉన్న ఒక నియోజకవర్గం  . భౌగోళికంగా ఈ ప్రాంతం చాలా మంచి సారవంతమైన పవిత్ర భూమి. భక్తి భావానికి పుట్టినిల్లుగా విరాసిల్లుతుంది. ఎన్నో పవిత్ర దేవాలయాలను తనవడిలో ఉంచుకున్న పవిత్రభూమి మన రేపల్లె నియోజకవర్గం .

ఈ నియోజక వర్గంలో  ప్రతీ గ్రామం లోను ఏదో ఒక మహాక్షేత్రం నెలకొని ఉంది. అవన్నీ ప్రాఛీనమైనవే ,వేటికవి ప్రాముక్యత సంతరించుకున్నవే. ఇన్ని మహాక్షేత్రాలు ఒకే ప్రాంతం లో నెలకొని ఉండటం , ఆంధ్రప్రదేశ్ లోనే అపూర్వం.

ఎంతో మంది ప్రముఖులకు, కళాకారులకు, మేధావులకు,దేశభక్తులకు, మహాత్ములకు జన్మనిచ్చిన పవిత్ర ప్రాంతం , మన రేపల్లె నియోజక వర్గం . ఒకటి మాత్రం సత్యం ఈ ప్రాంతం  ఒక అన్నపూర్ణ , ఆధ్యాత్మిక క్షేత్రం , ఎందరో మహానుభావుల జన్మస్తలం .

ఈ రేపల్లె నియోజక వర్గంలో  పుట్టి , ఎంతో పేరు , ప్రఖ్యాతలు , సంపాదిచ్చిన కోందరు ప్రముఖుల మరియు గొప్ప నాయకుల సమాచారం మీకోసం.

 

Posted in Mainframe | Leave a comment